విరాట్ కోహ్లీ(virat kohli records) పేరు మీద ఉన్న 15 రికార్డులు 

By chandu160692

Published on:

virat-kohli-records

ఆధునిక క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి పేరు సువర్ణాక్షరాలతో రాయబడుతందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్లో అత్యంత వేగంగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మరియు ఉత్తమ ఫిట్‌నెస్ కలిగిన ఆటగాడిగా విరాట్ కోహ్లి ఉన్నాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా, ఉత్తమ కెప్టెన్‌గా కూడా కోహ్లి నిలిచాడు. అయితే, విరాట్ కోహ్లి పేరు మీద ఉన్న ఉత్తమ 15 రికార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

IND vs SL Today Match

  1. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలచాడు. 200 ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి ఈ రికార్డు సాధించగా, 259 ఇన్నింగ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.
  2. వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లికి కేవలం 10 సంవత్సరాల 68 రోజులు పట్టింది. అంతకు ముందు రాహుల్ ద్రవిడ్ 10 సంవత్సరాల 317 రోజుల్లో వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేయగా, విరాట్ కోహ్లి ఈ రికార్డును అధిగమించాడు.
  3. రెండు దేశాల మీద వరుసగా మూడు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. శ్రీలంక మరియు వెస్టిండీస్ మీద వరుసగా మూడు సెంచరీలు కోహ్లి నమోదు చేశాడు.
  4. ఒక సంవత్సరంలో 11 ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకుముందు హషీమ్ ఆమ్లా 15 ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేశాడు.
  5. కెప్టెన్‌గా టెస్టుల్లో వేగంగా 4 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. 65 ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 4 వేల పరుగులు చేయగా, అంతకుముందు బ్రియాన్ లారా 71 ఇన్నింగ్స్‌లో చేశాడు.
  6. పదవ టెస్ట్ మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లి
  7. ఆరు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో 300 కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి
  8. రోహిత్ శర్మతో కలిసి నాలుగు 200 పరుగుల పార్ట్‌నర్ షిప్స్ నెలకొల్పిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లి
  9. 194 వన్డే ఇన్నింగ్స్‌లో 9000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లి. అంతకుముందు ఈ రికార్డు ఎ.బి. డివిలియర్స్ పేరు మీద ఉంది. డివిలియర్స్ 205 ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగులు చేశాడు.
  10. టెస్ట్ సిరీసుల్లో 4 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి
  11. వన్డేల్లో రెండవ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి ఉన్నాడు. అతను చేజింగ్‌లో 23 సెంచరీలు చేశాడు.
  12. వరుసగా రెండేళ్ల పాటు మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు.
  13. ఇంటర్నేషనల్ క్రికెట్లో 50కి పైగా సగటుతో 15,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తిగా విరాట్ కోహ్లి నిలిచాడు.
  14. టెస్టుల్లో ఒక కెప్టెన్‌గా ఉండి ఆరు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. అంతకు ముందు బ్రియాన్ లారా 5 డబుల్ సెంచరీలు చేశాడు.
  15. ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆరు వన్డే సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. 

Leave a Comment