Table of Contents
man of the series t20 world cup in telugu టి20 వరల్డ్ కప్ అంటేనే ప్రేక్షకులకు, బెట్టర్‌లకు చాలా ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం కష్టం అవుతుంది. అయితే, జట్లను గెలిపించడానికి చాలా మంది ప్లేయర్స్ ఉత్తమ ప్రదర్శన చేస్తారు. వారిలో టోర్నమెంట్ వారీగా ఒక్కొక్కరినీ టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జాబితా
man of the series t20 world cup in telugu
ఇప్పటి వరకూ జరిగిన వరల్డ్ కప్‌ల్లో టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జాబితా మీ కోసం ఇక్కడ ఉంది.
క్ర.సం | క్రికెటర్ పేరు | దేశం | సంవత్సరం |
1 | షాహిద్ అఫ్రిది | పాకిస్తాన్ | 2007 |
2 | తిలకరత్నే దిల్షాన్ | శ్రీలంక | 2009 |
3 | కెవిన్ పీటర్సన్ | ఇంగ్లాండ్ | 2010 |
4 | షేన్ వాట్సన్ | ఆస్ట్రేలియా | 2012 |
5 | విరాట్ కోహ్లి | భారతదేశం | 2014 |
6 | విరాట్ కోహ్లి | భారతదేశం | 2016 |
7 | డేవిడ్ వార్నర్ | ఆస్ట్రేలియా | 2021 |
8 | సామ్ కర్రన్ | ఇంగ్లాండ్ | 2022 |
9 | జస్ప్రీత్ బుమ్రా | భారతదేశం | 2024 |
2007 టి20 వరల్డ్ కప్ – షాహిద్ అఫ్రిది – పాకిస్తాన్
2007లో మొదటి టి20 వరల్డ్ కప్ జరగ్గా, దీనిని భారత్ కైవసం చేసుకుంది. ఇందులో ఫైనల్లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోగా, పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎంపికయ్యాడు. 2007 టి20 వరల్డ్ కప్‌లో 12 వికెట్లు తీసిన అఫ్రిది, ఈ టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా నిలచాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో 91 పరుగులు కూడా చేశాడు.
2009 టి20 వరల్డ్ కప్ – తిలకరత్నే దిల్షాన్ – శ్రీలంక
2009లో T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. అయితే, రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టు క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్ 317 పరుగులు చేయగా, ఇందులో 3 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
2010 టి20 వరల్డ్ కప్ – కెవిన్ పీటర్సన్ – ఇంగ్లాండ్
2010లో జరిగిన టి20 వరల్డ్‌ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. అయితే, ఇంగ్లాండ్ జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న కెవిన్ పీటర్సన్ ఈ టోర్నమెంటులో టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఈ టోర్నమెంటులో కెవిన్ పీటర్సన్ స్ట్రైక్ రేటు 137 ఉండగా, మొత్తం టోర్నమెంటులో 248 పరుగులు చేశాడు.
2012 టి20 వరల్డ్ కప్ – షేన్ వాట్సన్ – ఆస్ట్రేలియా
2012లో జరిగిన T20 వరల్డ్ కప్ వెస్టిండీస్ గెలుచుకుంది. అయితే, టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ నిలిచాడు. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో షేన్ వాట్సన్ 6 మ్యాచ్‌ల్లో 249 పరుగులు చేయగా, బౌలింగ్‌లో కూడా ఒక ఓవర్‌కు 7 ఎకానమీతో 11 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
2014 టి20 వరల్డ్ కప్ – విరాట్ కోహ్లి – ఇండియా
2014లో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి సత్తా చాటాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా 121 స్ట్రైక్ రేటుతో 242 పరుగులు చేసి టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జాబితాలో మొదటి సారి నిలిచాడు. అయితే 2014 వరల్డ్ కప్‌ను శ్రీలంక జట్టు ఇండియా పైన గెలిచి విజేతగా నిలిచింది.
Virat Kohli: GOAT of T20 World Cup
2016 టి20 వరల్డ్ కప్ – విరాట్ కోహ్లి – ఇండియా
2016 T20 వరల్డ్ కప్ టోర్నమెంటులో కూడా విరాట్ కోహ్లి టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జాబితాలో రెండవ సారి నిలిచాడు. ఈ టోర్నీలో 136 స్ట్రైక్ రేటుతో కోహ్లి 273 పరుగులు చేసి వరుసగా రెండు టి20 వరల్డ్ కప్‌ల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో కోహ్లి మూడు అర్ద సెంచరీలు నమోదు చేశాడు. అయితే, ఈ టి20 వరల్డ్ కప్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది.
2021 టి20 వరల్డ్ కప్ – డేవిడ్ వార్నర్ – ఆస్ట్రేలియా
2021 T20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించగా, 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓడించింది. అయితే, ఆస్ట్రేలియా మొదటి సారి టి20 వరల్డ్ కప్ గెలుచుకోగా, ఈ టోర్నమెంటులో వార్నర్ 289 పరుగులు చేసి టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జాబితాలో మొదటి సారి నిలిచాడు.
2022 టి20 వరల్డ్ కప్ – సామ్ కర్రన్ – ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కర్రన్ 2022 టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మొత్తం ఈ టోర్నమెంటులో 13 వికెట్లు సామ్ కర్రన్ తీశాడు. అంతేకాకుండా పాకిస్థాన్ మీద జరిగిన ఫైనల్ మ్యాచులో మూడు వికెట్లు సాధంచి ఇంగ్లాండ్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
2024 టి20 వరల్డ్ కప్ – జస్ప్రీత్ బుమ్రా – ఇండియా
ఇండియా టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 టి20 వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా మొత్తం ఈ టోర్నమెంటులో 15 వికెట్లు సాధించాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా మీద జరిగిన ఫైనల్ మ్యాచులో 4.50 ఎకానమీతో 2 వికెట్లు సాధించాడు.
టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ – FAQs
1: రెండు సార్లు వరుసగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎవరు నిలిచారు?
A: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండు టి20 వరల్డ్ కప్‌ల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు కోహ్లి పేరిట ఉంది.
2: మొదటి టి20 వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించింది?
A: పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎంపికయ్యాడు. 2007 టి20 వరల్డ్ కప్‌లో 12 వికెట్లు తీసిన అఫ్రిది, అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా నిలచాడు.
3. 2024 టి20 వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎవరు నిలిచారు?
A: 2024 టి20 వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.