(rcb vs csk prediction) గత ఏడాది ఛాంపియన్స్‌గా ఉన్న CSK ఎప్పటిలాగే పెద్ద పేరున్న స్టార్లతో కూడిన జట్టును కలిగి ఉంది. శుక్రవారం సాయంత్రం చెపాక్‌లోని MA చిదంబరం స్టేడియంలో RCBతో తలపడనుంది. ఈ మ్యాచుతో IPL 2024 ఎడిషన్ మొదలు కానుంది. అయితే, ఈ మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారో మనం అంచనా వేద్దాం.
CSK VS RCB మ్యాచ్ ప్రిడిక్షన్ & విశ్లేషణ
(rcb vs csk prediction) CSK ప్రస్తుత ఛాంపియన్లుగా వారి అభిమానుల ముందు ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అలాగే RCB మీద చాాలా ఉత్తమమైన రికార్డులను వీరు కలిగి ఉన్నారు. గత ఏడాది ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడటంతో, ఇందులో CSK 8 పరుగుల తేడాతో గెలుపొందింది. MS ధోని నాయకత్వంలో చెన్నై జట్టు గత ఐదు మ్యాచ్స్ ఆడగా, అందులో నాలుగు విజయాలు సాధించింది.
అయితే, క్రికెట్ విశ్లేషకులు RCB తప్పకుండా గెలుస్తుందని అంటున్నారు! ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలో విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్ వంటి క్రికెటర్స్‌తో RCB బ్యాటింగ్ బలంగా ఉందని వారు చెప్తున్నారు. ఈ ఐపిఎల్ సీజన్లో అగ్రశ్రేణి జట్లలో RCB ఒకటిగా ఉండే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రివ్యూ
(rcb vs csk prediction) చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచుకు డెవాన్ కాన్వే లేకుండానే ఆడనుంది. అతడు బొటనవేలు గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరం కానున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ అయిన డెవెన్ కాన్వే 2024లో ఫామ్‌తో పోరాడుతున్నాడు. అయితే 2023 IPL సీజన్లో అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. 2023 సీజన్లో 6 హాఫ్ సెంచరీలు సహా టాప్ స్కోరు 92 చేశాడు.
అయితే, ఫినిషర్‌గా MS ధోని నిలిచే అవకాశం ఉంది. మొయిన్ అలీ మిడిల్ ఆర్డలో ఎలాంటి డెలివరీ అయినా కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. డారిల్ మిచెల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా ఆడే అవకాశం ఉంది.
బ్యాట్ మరియు బాల్ రెండింటితో సత్తా చాటడానికి న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్ అటాక్ సంబంధించి రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ముస్తఫిజుర్ రెహమాన్ ఉన్నాడు. అలాగే మహేంద్ర సింగ్ ధోని యొక్క ప్రశాంతమైన కెప్టెన్సీతో, అటు ఉత్తమ బ్యాటింగ్ మరియు బౌలింగ్ లైనప్ కలిగి ఉన్నCSK వారి సొంత అభిమానుల ముందు విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
CSK ప్లేయింగ్ XI అంచనా
(rcb vs csk prediction) రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ధోని (C & wk), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రివ్యూ
(rcb vs csk prediction) RCB జట్టు గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరుకోవడంలో విఫలమైనప్పుడు చాలా నిరాశ చెందారు. అయితే, 2024 వుమెన్స్ ప్రీమియర్ లీగ్ గెలవడం RCB ఫ్రాంచైజీకి చాలా ఉత్సాహం ఇచ్చింది. WPLని గెలవడం మహిళా క్రికెటర్లకు అద్భుతమైన ముగింపు ఇవ్వగా, మహిళల జట్టు విజయంతో RCB క్రికెటర్స్ చాలా ప్రేరణ పొందారు.
RCBకి ఇండియా నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ బ్యాట్స్మెన్లు కలిగిన జట్టు ఉంది. అనేక ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టామ్ కుర్రాన్ జట్టుకు బలంగా ఉండనున్నాడు.
అత్యంత శక్తివంతమైన బ్యాట్స్మెన్లలో ఫఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. వీరు బ్యాటింగ్‌తో మొదటి బంతి నుండే CSK బౌలర్లపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
RCB ప్లేయింగ్ XI అంచనా
(rcb vs csk prediction) ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, రజత్ పాటిదార్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), ఆకాష్ దీప్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్
వాతావరణ పరిస్థితులు
చెన్నైలో శుక్రవారం సాయంత్రం ఆకాశం అంతా స్వచ్చంగా ఉంటుందని అంచన వేస్తున్నారు. గాలిలో తేమ స్థాయి 75% నుండి పడిపోకుండా ఉష్ణోగ్రత అంతటా 29 డిగ్రీల వద్ద ఉంటుందని అంచనా వేశారు.
CSK vs RCB పిచ్ రిపోర్ట్
(rcb vs csk prediction) చెపాక్ మైదానం దశాబ్దాలుగా చాలా పెద్ద మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. IPL చరిత్రలో అనేక భారీ విజయాలను కూడా చూసింది. బంతి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది మరియు పేసర్లను కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. గత 16 ఐపిఎల్ సీజన్లను చూస్తే, సగటు స్కోరు 180 చేరుకునే అవకాశం ఉంది.
IPL 2024 SRH : కొత్త కెప్టెన్‌తో.. కప్పు కొడతామా?
టాస్ గెలిస్తే బౌలింగ్ అనుకూలం
(rcb vs csk prediction) గత ఏడాది ఐపీఎల్లో టాస్ గెలిచిన వారు మొదట ఫీల్డింగ్ చేయడం సాధారణ విధానం. పిచ్ మరియు పరిస్థితుల పరంగా ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ఎల్లప్పుడూ కొంచెం సందేహం ఉంటుంది. ఒక వేళ CSK మరియు RCB రెండింట్లో ఎవరు టాస్ గెలిచినా, ముందుగా బౌలింగ్ చేయాలని మేము అంచనా వేస్తున్నాము.