Table of Contents
Neeraj Chopra News: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని మరియు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఇద్దరూ చాలా ఉత్తమ అథ్లెట్లుగా నిలిచారు. ధోని భారతదేశానికి వన్డే మరియు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించి దేశ క్రికెట్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే, నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో బంగారు మరియు వెండి పథకాలు సాధించి గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందాడు. అయితే, వీరిద్దరి మధ్య ఒకే సారూప్యత కలిగిన లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గెలవాలనే మనస్తత్వం
ధోని 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టులో క్రికెటర్లలో ఉండే నిరాశ, నిస్పృహలను పోగొట్టాడు. ప్రతి మ్యాచ్ గెలవాలనే సంకల్పంతోనే ఆడాడు. మ్యాచ్ చివరి బంతి వరకూ ప్రతి ఒక్క ఆటగాడు గెలవాలనే కసితోనే ఆడాలని, అప్పుడే విజయం వరిస్తుందని భావించేవాడు. (Neeraj Chopra News)
అలాగే, నీరజ్ చోప్రా కూడా జావెలిన్ త్రో పోటీల్లో పాల్గొన్న ప్రతి మ్యాచులో గెలవాలనే సంకల్పంతోనే ఉన్నాడు. టోక్కో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న తర్వాత, అప్పటి నుంచి జరిగిన ప్రతి పోటీలో ఛాంపియన్‌గా నిలిచాడు. ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కూడా నీరజ్ చోప్రాను ఓడించడానికి 5 సంవత్సరాలు పట్టిందంటే, నీరజ్ చోప్రా ఎంత కసిగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రశాంతమైన స్వభావం
(Neeraj Chopra News) ధోని తన మొత్తం క్రికెట్ కెరీర్లో గ్రౌండ్లో కానీ, బయట కానీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్లో చివరి బంతి వరకూ అందరూ చాలా టెన్షన్ పడ్డారు. కానీ, ధోని మాత్రం ప్రశాతంగా ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. అందుకే, ధోనిని అందరూ ‘కెప్టెన్ కూల్’ అంటారు.
నీరజ్ చోప్రా కూడా పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుస్తాడనుకుంటే, వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత ప్రజలు, అభిమానులు అందరూ బాధపడినా.. నీరజ్ చోప్రా చాలా సహనంతో, ప్రశాంతంగా ఉన్నాడు. బంగారు పతకం గెల్చుకున్నందుకు అర్షద్ నదీమ్‌ను అభినందిస్తూ.. అతనితో సెల్ఫీ కూడా తీసుకున్నాడు.
గాయాలు ఉన్నా ఆటే ప్రాణం
ధోని ఐపిఎల్ 2023 సీజన్ మొత్తం గాయాలతోనే ఆడాడు. మోకాలి గాయంతో కూడా 2023 ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. అలాగే, 2024 ఐపిఎల్‌లో ఫిట్నెస్ లేకపోయినా క్రికెట్ మీద ఉన్న ప్రేమతో సీజన్ మొత్తం ఆడాడు. (Neeraj Chopra News)
అదే విధంగా, నీరజ్ చోప్రా కూడా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతోనే ఆడాడు. మోకాలి గాయం ఎంత ఇబ్బంది పెట్టినా ఫైనల్ వరకూ వచ్చి పోరాడాడు. ప్రస్తుతం శస్త్ర చికిత్స్ చేయించుకోవడానికి జర్మనీ వెళ్లాడు.