టెస్టుల్లో 1000 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్

By chandu160692

Updated on:

Yashasvi-Jaiswal

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచులో భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ పలు రికార్డులు నమోదు చేశాడు. వేగంగా టెస్టులో 1000 పరుగులు చేసిన రెండవ భారత క్రికెటరుగా నిలిచాడు. అలాగే, ఇంగ్లాండ్ మీద ఒక టెస్టు సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా ఉన్నాడు.

ఈ సిరీస్‌లో మొత్తం 681 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చేసిన 655 పరుగుల రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే ఒకే జట్టు మీద టెస్టుల్లో ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ మీద 26 సిక్సులు కొట్టిన యశస్వి జైస్వాల్, సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 25 సిక్సుల రికార్డును అధిగమించాడు

Leave a Comment