IPL 2024 SRH : కొత్త కెప్టెన్‌తో.. కప్పు కొడతామా?

By chandu160692

Published on:

IPL 2024 SRH TEAM

2013 సంవత్సరంలో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాత్ స్థానంలోకి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2016 సీజన్లో ఐపిఎల్ టైటిల్ సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, గత మూడు ఐపిఎల్ సీజన్ల నుంచి మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా పేలవమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా, డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయడం, ఆ తర్వాత కేన్ విలియమ్సన్‌ను కూడా కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఇద్దరూ ఫ్రాంచైజీ నుంచి కూడా వెళ్లిపోయారు. అయితే, ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. గత సీజన్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్థానంలో కెప్టెన్‌గా కూడా నియమించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉత్తమ విజయాలు నమోదు చేస్తున్న పాట్ కమ్మిన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రెండవ సారి కప్ అందిస్తాడా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2024 SRH గత మూడు సీజన్లలో అట్టర్ ఫ్లాప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీద ఆధారపడుతుందని అందరూ అంటారు. కానీ, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి విదేశీ క్రికెటర్స్‌ను దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అభిమానులు ఉన్నారు. 2016 ఐపిఎల్ విజేతగా డేవిడ్ వార్నర్ నాయకత్వంలో SRH కప్ కొట్టింది. అయితే, మొదట డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీ నుంచి తీసేసిన యాజమాన్యం, ఆ తర్వాత సీజన్లో కేన్ విలియమ్స‌న్ కూడా వద్దనుకుంది. 2021 సీజన్ నుంచి కెప్టెన్లను మారుస్తున్నా, ఫలితాలు మాత్రం చాలా నిరాశగా ఉన్నాయి. 2021 ఐపిఎల్ సీజన్లో పదవ స్థానంలో, 2022 ఐపిఎల్ సీజన్లో ఎనిమిదవ స్థానంలో, 2023 ఐపిఎల్ సీజన్లో మళ్లీ చివరి స్థానంలో SRH ఉంది.

IPL 2024 SRH మరొక సారి ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కెప్టెన్ బాధ్యతలు

2024 ఐపిఎల్ సీజన్‌కు ఉత్తమ విదేశీ ఆటగాళ్లు, స్వదేశీ క్రికెటర్స్‌తో సన్ రైజర్స్ జట్టు చాలా బలంగా ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్‌లో రాణించి ట్రావిస్ హెడ్‌ను కొనుగోలు చేసింది. అలాగే, ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను ఈ సారి SRH కెప్టెన్‌గా నియమించారు. మినీ ఐపిఎల్ వేలంలో కమ్మిన్స్‌ను ఏకంగా 20.5 కోట్లకు కొన్నారు. దీంతో ఈ సారి ఆస్ట్రేలియన్ కెప్టెన్సీలో SRH టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ విజేతగా నిలిచినప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే, 2009లో డెక్కన్ చార్జర్స్ కప్ గెలిచినప్పుడు కూడా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. IPL 2024 Schedule

సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు

ఉత్తమ విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండటం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ముఖ్యమైన బలంగా ఉన్నాయి. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసీన్, మార్కో జాన్సెన్, హసరంగా వంటి క్రికెటర్స్ ఉన్నారు. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ మీద అందరికీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, టి20ల్లో గత సంవత్సరంగా 152 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కలిగిన ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక ఐడెన్ మార్క్రమ్, క్లాసీన్, ఫిలిప్స్ ఆడితే మ్యాచ్‌ను వన్ సైడ్ చేసే ఆటగాళ్లుగా సత్తా చాటారు. విదేశీ బౌలర్లలో జాన్సన్, హసరంగా ఉత్తమ ఫాంలో ఉన్నారు. అలాగే, భారత బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ రాణిస్తే SRH బౌలింగ్‌కు తిరుగుండదు.

సన్ రైజర్స్ హైదరాబాద్ బలహీనతలు

అనుభవం లేని భారత ఆటగాళ్లు, ఎక్కువ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో.. తుది జట్టులో ఎవరిని ఎంచుకోవాలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే, ఐపిఎల్ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. భారత ఆటగాళ్లైన అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్, వాషింగ్టన్ సుందర్ ఉత్తమంగా ఆడాలి. అలాగే, గత నాలుగు సీజన్లలో నలుగురు కెప్టెన్లను ఫ్రాంచైజీ మార్చింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఐడెన్ మార్క్రమ్.. ఇప్పుడు పాట్ కమ్మిన్స్. తరచుగా కెప్టెన్‌ను మార్చడం వల్ల జట్టు సమతుల్యం దెబ్బతినే అవకాశం ఉంది. అభిమానులకు చేరువైన వార్నర్, విలియమ్సన్ లేకపోడం… ఇప్పుడు ఉన్న క్రికెటర్లను తెలుగు అభిమానులకు దగ్గరకు చేయడానికి ఫ్యాన్స్ మీట్ వంటివి ఏర్పాటు చేయడం కూడా చాలా ముఖ్యం.

చివరగా, కొత్త కెప్టెన్ పాట్ కమ్మిన్, కొత్త కోచ్ డేనియల్ వెట్టోరి.. అలాగే, ఉత్తమ భారత మరియు విదేశీ ఆటగాళ్లు. అందరూ సమిష్టిగా ఆడి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు రెండవ సారి మరియు హైదరాబాద్ సిటీకి ముచ్చటగా మూడవ సారి కప్ తేవాలని తెలుగు రాష్ట్రాల అభిమానులు ఆశిస్తున్నారు.

Know More: ట్విట్టరో రిప్ హార్థిక్ పాండ్యా.. ఎందుకో ఇక్కడ చదవండి

1 thought on “IPL 2024 SRH : కొత్త కెప్టెన్‌తో.. కప్పు కొడతామా?”

Leave a Comment