#RIPHARDIKPANDYA ట్విట్టర్‌లో రిప్ హార్ధిక్ పాండ్యా

By chandu160692

Published on:

RIP hardik pandya in twitter

ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించుకోవడంపై ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న రోహిత్ శర్మ మీద హార్థిక్ పాండ్యా వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ హార్థిక్ పాండ్యాను ట్రోలింగ్ చేస్తున్నారు. #RIPHARDIKPANDYA అనే హ్యాష్ ట్యాగ్ గత 12 గంటల నుంచి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఐదు సార్లు కప్ అందించిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2013 నుంచి 2023 వరకూ ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచింది. కానీ, 2024 ఐపిఎల్‌లో రోహిత్ శర్మ స్థానంలో హార్థిక్ పాండ్యాను ముంబయి జట్టుకు కెప్టెన్‌గా మేనేజ్‌మెంట్ నియమించింది.

రోహిత్ భాయ్ మద్దతు ఉంటుంది : హార్ధిక్ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో మాజీ కెప్టెన్‌తో ఆడటాన్ని ఆనందిస్తానని, తప్పకుండా రోహిత్ శర్మ మద్ధతు మరియు ముంబయి ఇండియన్స్ అభిమానుల మద్ధతు తనకు ఉంటుందని హార్థిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో తమ ఇద్దరి మధ్య మంచి వాతావరణం ఉంటుందని, జట్టులో నెగటివ్ వాతావరణం ఉంటుందని కొందరు పేర్కొనడంలో వాస్తవం లేదని హార్థిక్ పేర్కొన్నాడు.
“ఈ ఐపిఎల్ భిన్నంగా ఏం ఉండదు, ఎందుకంటే నాకు రోహిత్ శర్మ సహాయం అవసరమైతే ఖచ్చితంగా సహాయం చేయడానికి రోహిత్ నిలబడతాడు” అని హార్దిక్ సోమవారం అన్నాడు. “రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్. అతను ఒక జట్టును ఎలా ముందుకు నడిపించాడో నేను చూశాను. అలాగే ముంబయి ఇండియన్స్ జట్టుకు రోహిత్ ఐదు ఐపిఎల్ ట్రోఫీలు అందిచాడు. నేను ఇప్పుడు అతని విజయాలను ముందుకు తీసుకుని వెళ్తాను.” అని హార్థిక్ పాండ్యా తెలిపాడు.
2015లో హార్దిక్ అరంగేట్రం చేసినప్పుడు రోహిత్ ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. “నేను రోహిత్ కింద 10 సంవత్సరాలు ఆడాను మరియు 2024 సీజన్లో నేను ముంబయి ఇండియన్స్ బాధ్యతలు మోస్తున్నాను” అని హర్థిక్ పాండ్యా అన్నాడు.

ఐపిఎల్‌లో రిచెస్ట్ జట్టు (richest ipl team) కోసం క్లిక్ చేయండి

రోహిత్‌తో ఇంకా మాట్లాడలేదు… హార్ధిక్

రోహిత్‌ శర్మతో జట్టు విషయాల గురించి ఇంకా మాట్లాడలేదని. “గత రెండు నెలలుగా మేము ఒకరినొకరు చూడలేదు. మేము అందరం ప్రొఫెషనల్ క్రికెటర్స్, సరైన సమయానికి అందరం కలిసి జట్టు విజయం సాధించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం, ”అని హార్దిక్ అన్నారు. వన్డే ప్రపంచ కప్‌లో గాయం కారణంగా గత సంవత్సరం అక్టోబర్ నుంచి క్రికెట్‌కు హర్ధిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు.
మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మ్యాచుతో కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా మొదటి మ్యాచ్ ఆడనున్నాడు.

Leave a Comment