(rcb wpl match in telugu) :WPL 2024 ఛాంపియన్స్‌గా RCB.. కోహ్లి రికార్డు బద్దలు

By chandu160692

Published on:

RCB WPL Match

(rcb wpl match in telugu) వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. పురుషుల జట్టు గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్‌ కోసం ఎదురు చూస్తుండగా, మహిళల జట్టు కేవలం రెండవ సీజన్లోనే ఛాంపియన్స్‌గా నిలిచారు. దీంతో ఐపిఎల్ ట్రోఫీని అందుకోవాలనే 17 ఏళ్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల ఎట్టకేలకు నెరవేరింది ఆదివారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మీద జరిగిన ఫైనల్ మ్యాచులో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

(rcb wpl match in telugu) 64-0 నుంచి 113 పరుగులకు ఢిల్లీ ఆలౌట్

WPL ఫైనల్ మ్యాచులో మొదట బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ, చాలా దూకుడుగా బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఒక్క వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, 49 పరుగులకే 10 వికెట్లను కోల్పోయింది. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ శ్రేయాంక పాటిల్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్లలో షెఫాలీ వర్మ్ మరియు మెగ్ లానింగ్ మాత్రమే రాణించారు. షెఫాల్ వర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేసిన టాప్ స్కోరర్‌గా నిలిచింది. మెగ్ లానింగ్ 23 బంతులు ఆడి 23 పరుగులు చేసింది.

(rcb wpl match in telugu) రెండు వికెట్స్ కోల్పోయి ఛేదించిన RCB

ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. RCB క్రికెటర్లలో ఎలిసి పెర్రీ (37 బంతుల్లో 35 పరుగులు), సోఫీ డివైన్ ( 27 బంతుల్లో 32 పరుగులు), స్మృతి మంధాన (39 బంతుల్లో 31 పరుగుల) చేసి జట్టును విజయానికి దగ్గరగా చేర్చారు. చివర్లో రిచా ఘోష్ (14 బంతుల్లో 17 పరుగులు) చేయడంతో RCB WPL విజేతగా నిలిచింది.

(rcb vs dc wpl highlights in telugu) చరిత్ర సృష్టించిన RCB పోస్ట్

WPL 2024 విజేతగా నిలిచిన తర్వాత, విన్నింగ్ ఫొటోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. RCB ఉమెన్స్ టీమ్ ట్రోఫీతో ‘క్వీన్స్ 2024‌’ అనే బోర్డు వెనకాల కలిసి ఫోటో దిగారు. దీనిపైన మా టీం అతి పెద్ద విజయం’ అని క్యాప్షన్ రాశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన కేవలం 9 నిమిషాల్లోనే 10 లక్షల లైక్స్ రావడం రికార్డు సృష్టించింది.

(rcb wpl match in telugu) కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన RCB

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన విన్నింగ్ పోస్టు, తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ సాధించిన ఇండియన్ అకౌంట్ పోస్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో విరాట్ కోహ్లి పోస్ట్ చేసిన దానికి 10 నిమిషాల్లో 10 లక్షల లైక్స్ వచ్చాయి. మొత్తం టాప్ 10 ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో 7 కోహ్లివే ఉండటం గమనార్హం.

(rcb wpl match in telugu) బెంగళూరులో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఐపిఎల్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రూపంలో తమ ఐపిఎల్ కప్ కల నెరవేరిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్, కొరమంగళ, ఎం.జి. రోడ్ తదితర ఏరియాల్లో ఫ్యాన్స్ అందరూ చేరి ‘ఈ సాల కప్ నమ్దు’ (ఈ సారి కప్ మనది), RCB… RCB అని నినాదాలు చేశారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విజేతగా నిలిచిన విధంగానే, ఈ సారి ఐపిఎల్ విజేతలుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. Richest IPL Team

(rcb vs dc wpl highlights in telugu) అందరికీ ధన్యవాదాలు : స్మృతి మంధన

WPL విజేతగా నిలిచిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధన విజయంపై సంతోషాన్ని పంచుకుంది. ” గెలిచిన ఫీలింగ్ చాలా బాగుంది. మాటల్లో కూడా చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. అయితే, ఈ సీజన్లో మేం ఆడిన విధానం చాలా బాగుంది. సమిష్టిగా అందరం కలిసి ఈ విజయం సాధించాం. మా జట్టులో ఉన్న ప్రతి క్రికెటర్‌కు ధన్యవాదాలు. మొదట్లో ఢిల్లీలో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. తర్వాత నమ్మకంతో ముందడుగు వేసి విజేతగా నిలిచాం” అని పేర్కొంది.

(rcb vs dc wpl highlights in telugu) ఈ సాల కప్ నమ్దు – RCB ఫ్యాన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను కూడా స్మృతి మంధన కొనియాడింది. అలాగే, కన్నడలో ఫ్యాన్స్ అందరూ ‘ఈ సాలా కప్ నమదే’ (ఈ సారి కప్ మనదే) అని అంటారు. ఇప్పటి నుంచి ఈ విజయంతో ‘ఈ సాలా కప్ నమ్దూ’ (ఈ సారి కప్ మనది) అంటారు. కన్నడ నాకు అంతగా రాకపోయినా, అభిమానులకు దీని గురించి చెప్తుంటే గర్వంగా ఫీలవుతున్నానని స్మృతి మంధన తెలిపింది.

గత సీజన్ పరాజయం నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. గత సీజన్లో చేసిన తప్పులను సరిదిద్దుకోవడం వల్ల ఇప్పుడు విజేతలుగా నిలిచాం. RCB మేనేజ్‌మెంట్ కూడా ‘ఇది మీ టీం.. విజయం సాధించడానిక అనువైన నిర్ణయాలు తీసుకోండి’ అని తెలిపింది. ఈ సారి ట్రోఫీ సాధించడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ విజయం మా జట్టు టాప్ 5 అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని స్మృతి మంధన తెలిపింది.

Leave a Comment